ACE Engineering College a Center for honing Talent and Learn Employable Skills

ఏస్ ఇంజనీరింగ్ కళాశాల – ప్రతిభ, మెలకువల అభివృద్ధికి కేంద్రం

ముడి దశలోని ప్రతిభ కలిగి, ఇంజనీరింగ్ రంగంలో తమ భవిష్యత్తును తీర్చి దిద్దుకోవాలనుకునే యువ విద్యార్థులను ప్రోత్సహించి, వారి మేధకు మెరుగులు దిద్ది, వారిని విలువలతో కూడుకున్న, మెలుకువలు కలిగిన సుశిక్షితులైన ఇంజనీర్లుగా మలచి, ఉద్యోగ సంసిద్ధులైన, బాధ్యతతో కూడుకున్న, గౌరవప్రదమైన సమాజ సేవకులుగా తీర్చిదిద్దే ప్రధాన లక్ష్యంతో & “యాదాల సత్యనారాయణ స్మారక సొసైటి “ ద్వారా ఏస్ ఇంజనీరింగ్ కళాశాల స్థాపించబడినది.

ప్రముఖ విద్యావేత్త, ఇంజనీర్, ఉత్తేజ ప్రేరకులు, ప్రోత్సాహకులు, దరిదాపు మూడు దశాబ్దాల అపారమైన అనుభవజ్ఞులు,
దేశంలో ప్రఖ్యాతి చెందిన ఏస్ ఇంజనీరింగ్ అకాడమి వ్యవస్థాపకులు ఐన, అందరి ద్వారా ప్రేమతో జి.కె గా పిలువబడే శ్రీ వై.వి. గోపాలకృష్ణమూర్తి గారి సారథ్యంలో ఏస్ ఇంజనీరింగ్ కళాశాల ఇంజనీరింగ్ విద్యారంగంలో ఒక వినూత్న తరహాలో సేవలందిస్తున్నది. గేట్, కేంద్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇంకా వేర్వేరు రాష్ట్రాల సర్విస్ కమిషన్లు నిర్వహించే ఇంజనీర్ స్థాయి ఉద్యోగ నియామకాలకు శిక్షణనిస్తూ, గత రెండు దశాబ్దాలలో నాణ్యమైన శిక్షణ ద్వారా ఎందరో ర్యాంకర్లను ప్రభుత్వ ఉద్యోగాలకు అందిస్తూ, ప్రఖ్యాతి చెందిన ఐఐటి, ఎన్ఐటి, ఇంకా ఇతర యూనివర్సిటీలలో ప్రవేశాలకు ర్యాంకర్లను అందించిన ఏస్ ఇంజనీరింగ్ అకాడమి యొక్క దిశానిర్దేశంతో ఏస్ ఇంజనీరింగ్ కాలేజి ప్రస్థానం సాగిస్తున్నది.

ఏస్ ఇంజనీరింగ్ కాలేజి 2007 లో స్థాపించబడినది. నగర కాలుష్యానికి దూరంగా, హైదరాబాద్ – వరంగల్ రహదారిలో హైదరబాద్ నగర శివార్లలోని ఘట్కేసర్ మండలంలోని అంకుశాపూర్ గ్రామంలో విద్యాబోధనకు అనుకూలమైన ప్రశాంత వాతావరణంలో నెలకొన్న ఏస్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నది. ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణం, పచ్చని పంటపొలాలు, తోటలు, నగర వనం మధ్యలో ఉన్న ఏస్ కాలేజి ప్రాచీన గురుకులాలను తలపిస్తుంది.

ఏస్ కాలేజిలో విద్యాబోధన పద్ధతులు:
విలువలతో కూడుకున్న విద్యాబోధనకు పెద్దపీటను వేసే ఏస్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యకు సంబంధించిన మౌలిక అంశాలతో పాటు సామాజిక బాధ్యతనుకూడా నేర్పుతూ నేటి సమాజానికి కావలసిన సమర్థ, సామాజిక బాధ్యత కలిగి, సమాజ శ్రేయస్సుకు తమ మేధను వెచ్చించే సుశిక్షితులైన, క్రమ శిక్షణ కలిగిన ఇంజనీర్లను తయారు చేస్తున్నది. తరగతి గదులలో సంప్రదాయిక మరియు అధునాతన బోధనా పద్ధతుల సమ్మేళనంతో మౌలికాంశాలపై పట్టు సాధించే దిశగా బోధన చేసి, ప్రయోగశాలలలో విద్యార్థులు స్వంతంగా, స్వతంత్రంగా ప్రయోగాలను చేసే విధంగా తర్ఫీదు ఉంటుంది. దీనితో పాటు విద్యార్థులకు అవసరమైన, ఉపయోగమైన ఇతర అదనపు విద్యా వనరులను అందిస్తూ, అధ్యాపకుల పర్యవేక్షణలో విద్యార్థులు చక్కగా చదువుకుని విజ్ఞానం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సాంకేతిక విజ్ఞానంతోపాటు ఉద్యోగంలో అవసరమయ్యే ఇతర మానవ సంబంధ, నిర్ణాయక, నడవడికి సంబంధించిన మెలకువలను ప్రధాన సాంకేతిక విద్యతో పాటు అనుసంధానం చేసే సమగ్ర విద్యాబోధన ఏస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రత్యేకతలు.

అధ్యాపక బృందం:
విద్యార్థుల మనస్సుకు హత్తుకునే విధంగా విద్యాబోధనలో నిష్ణాతులైన వై.వి. గోపాలకృష్ణమూర్తి నేతృత్వంలో అంకితభావంతో అధ్యాపక బృందం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలూ కృషి చేస్తున్నది. అధ్యాపకులు వేదిక పైని ప్రవక్తలు కారు, విద్యార్థితోపాటు ఎల్లప్పుడూ ఉంటూ వారికి కావలసిన మార్గ దర్శనం చేసే ఋషులు అని ప్రగాఢంగా విశ్వసించే యాజమాన్యంతో కలసి విద్యార్థులను మౌలిక విద్యతోపాటు ఇతర కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకునే విధంగా అధ్యాపక బృందం పనిచేస్తున్నది.

ప్రమాణాలతోకూడిన ఇంజనీర్ల పరిణామానికి విద్యాబోధన:
ఇంజనీరింగ్ విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే కాలేజీలోవిద్యాబోధనా విధానం సమతుల్యమై ఉండాలి. దీనికొరకు తరగతిగదులలో నేర్చిన అంశాలు నిజ జీవితంలోవాటి అవసరాన్ని, అవకాశాలను తెలుసుకునేందుకు ఉపయోగపడాలి. అంటే ఒక విద్యార్థి ఒక అంశాన్ని నాలుగుకోణాల్లో నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏస్ ఇంజనీరింగ్ కాలేజిలో వాతావరణం విద్యార్థి జ్ఞాన సముపార్జనకు అనుకూలంగా ఉంటుంది. తరగతిలోఅధ్యాపకులు మౌలికాంశాలను గురించి సోదాహరణంగా వివరిస్తారు. విద్యార్థులు ప్రయోగశాలలో అధ్యాపకుల పర్యవేక్షణలో అనువర్తనంచేసి తెలుసుకుంటారు. ఈ రెండు కోణాల తరువాత విద్యార్థి నేర్చుకున్న ప్రజ్ఞ, నిజ జీవితంలో దాని అవసరం, ఉపయోగం గురించి ప్రశ్నించి, విచారించి పరిణతి చెందిన విద్యార్థిగ తమను తాము మలచుకోవడానికి కాలేజి అధ్యాపక బృందం తమవంతు సహకారం అందించి విద్యార్థి అభివృద్ధికి సహాయం చేస్తుంది.

ఏస్‌లో విద్యార్థి జీవనం:
ఏస్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకోవడం ఒత్తిడితో కూడుకున్నదిగా కాక ఉల్లాసంతోనూ, ఉత్సాహంతోనూ కూడుకుని ఉండడమే కాకుండా వినోదాత్మకంగా ఉంటుంది. ఉత్తేజంతో చదువుకోవడానికి అవసరమైన ఆహ్లాదకరమైన, నిజమైన వాతావరణం ఉట్టిపడుతూ ఉంటుంది. విద్య, వినోదం, సమాచారం, ఆటలు కూడా సరైన మోతాదులో మేళవించిన విద్యబోధనా పద్ధతులు ఏస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రత్యేకతలు. తరగతులలో పాఠ్యాంశాల వివరణలు నిజ జీవితంలోని సందర్భ పరిశీలనల (Case Studies) చర్చల మేళనంతో కలిసి ఉంటుంది. అంకితభావంతో జీవిత లక్ష్యాన్ని సాధించాలనుకునే వారికి, ఇక్కడ లభించే ఇన్ని అవకాశాల దృష్ట్యా ప్రతి విద్యార్థికి ఏస్ ఇంజనీరింగ్ కాలేజి అందుబాటులో ఉన్న ఒక మంచి అవకాశం. విద్యార్థులను ఇబ్బంది పెట్టే వ్యక్తిగత, విద్యా విషయిక సమస్యలను దాపరికం లేకుండా చర్చించి వాటిని అధిగమించి, రెట్టించిన ఉత్సాహంతో తమ మెలకువలకు మెరుగులు దిద్దుకుని ఆశయాలను సాధించుకొనేలా ప్రోత్సహించేందుకు జీవన నైపుణ్యాలు, కెరీర్ కౌన్సిలింగ్ కోసం ఎల్లప్పుడూ విద్యార్థులకు అందుబాటులోఉండేలా ఒక అంకితమైన, స్వయంప్రతిపత్తి కలిగి ఏర్పరచిన అతి తక్కువ కాలేజీలలో ఏస్ ఇంజనీరింగ్ కాలేజి ఒకటి. ‘తుష్టి’ అనే పేర ఏర్పరచిన ఈ విభాగం విద్యార్థుల సమస్యల పట్ల సమగ్ర అవగాహన కలిగిన అనుభవజ్ఞుడైన అధ్యాపకుని అధ్వర్యంలో నెలకొల్పబడిన ఈవిభాగం వారి సమస్యలను సహానుభూతితో అర్థం చేసుకుని వారికి తన సహాయ సహకారాలు అందిస్తున్నది. దీనితోపాటు ఇంజనీరింగ్ రంగంలోని అపార అవకాశాలను, బ్రాంచికి ప్రత్యేక మైన అవకాశాల గురించి అవగాహనా సదస్సులను ఏర్పాటు చెయ్యడం, బి.టెక్‌ లోనే కాకుండా ఆ తరువాత కూడా అవసరమయ్యే కొన్ని మౌలిక మెలకువల మీద వర్క్‌షాప్‌లు నిర్వహించడం ఈ విభాగం చేసే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు.

ఏస్ ఇంజనీరింగ్ కాలేజి- ఒక విద్యార్థి కేంద్రిత వాత్సల్య పూరిత వాతావరణం:
ఏస్ ఇంజనీరింగ్ కాలేజిలో విద్యార్థి సంక్షేమం మౌలిక అంశం. వారి శ్రేయస్సుకు, సంక్షేమానికి అవసరమైన అన్ని
వసతుల ఏర్పాట్లు వారి అందుబాటులోఉంటాయి.

 •  స్వచ్చమైన, బలవర్ధకమైన త్రాగేనీరు అన్ని వేళల అందుబాటులో ఉండే విధంగా ఇన్ – హౌస్ నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు
 • నిరంతర విద్యుఛ్చక్తి సరఫరా కోసం 30 మెగావాట్ల సౌరశక్తి కేంద్రం ఏర్పాటు
 • విద్యార్థుల అవసరాలకు అందుబాటులో ఉండే విధంగా, అదనపు సమయాన్ని లేబొరేటరీలలో
  వాడుకోవాలనుకునేవారి సౌలభ్యం కోసం తక్కువ వినిమయంతో కూడుకున్న తరగతి గదులు, లేబొరేటరీలు
 • ఎల్ల వేళల ఇంటర్నెట్ వసతుల వినియోగం కోసం 80 ఎంబిపిఎన్ ల అధికమైన వేగంతో వై-ఫై ఇంటర్నెట్ వసతి
 • 35,000 కన్నఅధికమైన పుస్తకాలతో కూడుకున్న గ్రంథాలయ వసతి
 • పరిశోధనలపట్ల అభిరుచి కలిగినవారి కోసం డిజిటల్ లైబ్రరి వసతి
 • జంట నగరాల నలుమూలల నుండి కాలేజికి ప్రయాణించడానికి అనుకూలమైన, కాలేజి బస్సుల వసతి
 • విద్యా నాణ్యతకు పేరిన్నికగన్న ఏస్ ఇంజనీరింగ్ అకాడమికి చెందిన నిపుణులైన అధ్యాపకబృందం వెనుదన్ను
 • ప్రతిదినం విద్యార్థుల హాజరు గురించి తల్లిదండ్రులకు మొబైల్ కు సమాచారం అందించే వ్యవస్థ
 • 100 శాతం ర్యాగింగ్ రహిత కాంపస్
 • విద్యార్థులను ప్రోత్సహించి వారి ద్వారా ర్యాగింగ్ గురించి సమాచారం కాలేజి యాజమాన్యానికి వెంటనే అందించే మొబైల్ యాప్ అభివృద్ధి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ యాప్ ఉచితంగా పంపిణీ
 • అర్హులైన అందరు విద్యార్థులకూ ప్రాంగణ నియామకాలను కల్పించి సమర్థవంతంగా పనిచేస్తున్న ప్లేస్‌మెంట్ విభాగం
1 సివిల్ ఇంజనీరింగ్ 120
2 ఎలెక్ట్రికల్ అండ్ ఎలెక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 60
3 మెకానికల్ ఇంజనీరింగ్ 60
4 ఎలెక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 180
5 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 180
6 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ 60